అమరవీరులకు సెల్యూట్ కొడుతూ.. సైకిల్ ర్యాలీ!
ములుగు, అక్టోబర్ 27 (విజయక్రాంతి): అక్టోబర్ 21 పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం(Martyrs' Commemoration Day) సందర్భంగా తెలంగాణ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా మంగళవారం ములుగు జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ సైకిల్ ర్యాలీ(Cycle Rally) నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా ఎస్పీ కేకాన్ సుధీర్ రామనాథ్ ఆధ్వర్యంలో జరిగింది.
ఈ సందర్భంగా పోలీసు అమరవీరుల నిస్వార్థ సేవలను, ధైర్యసాహసాలను, ప్రజల రక్షణ కోసం వారు చేసిన ప్రాణత్యాగాలను స్మరించుకున్నారు. ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసులు అంకితభావంతో విధులు నిర్వహిస్తూ, అమరవీరుల ఆశయాలను కొనసాగించాలని ఈ కార్యక్రమం ద్వారా సందేశాన్ని అందించారు.
ఈ కార్యక్రమ నిర్వాహకుడిగా ఆపరేషన్స్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ డి తిరుపతి విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ సదానందం, ములుగు ఎస్‌డీపీఓ నలువాల రవీందర్, ములుగు సీఐ దారం సురేష్, సీసీఎస్ సీఐ కుమార్, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్లు అడ్మిన్ స్వామి, ఎంటీఓ వెంకటనారాయణ, వెల్ఫేర్ అండ్ హోంగార్డ్స్ విభాగం శ్రీకాంత్, ఎస్సైలు కృష్ణ ప్రసాద్, ములుగు వెంకటేశ్వర్లు, పస్రా తాజుద్దీన్, నార్లాపూర్ కమలాకర్, తాడ్వాయి జగదీష్, వెంకటాపూర్ చల్లా రాజు, ఎస్ఐ లు బుట్ట చంద్రశేఖర్, సాయి కృష్ణ, ఆర్‌ఎస్ఐలు సందీప్, అవినాష్‌తో పాటు క్యూ ఆర్‌టీ ప్రత్యేక బలగాల సిబ్బంది పాల్గొన్నారు.