98 జీవో నిర్వసితులకు ఉద్యోగాలు ఇవ్వలేని బీరo హర్షవర్ధన్ రెడ్డి

27-10-2026 | 03:08pm
  1. సిగ్గులేని పాదయాత్రలు చేస్తుండు.
  2. కొల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ మండల ప్రెసిడెంట్ బచ్చలకూర బాలరాజు విమర్శించారు.

కొల్లాపూర్ అక్టోబర్ 27: నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం కేంద్రంలోని మంగళవారం మంత్రి జూపల్లి కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మండల ప్రెసిడెంట్ బచ్చలకూర బాలరాజు మాట్లాడుతూ. చిన్నంబావి మండల కేంద్రంలో చల్లపాడు నుంచి చిన్నంబాయి వరకు రైతుల ముందు ముసలి కన్నీరు కారుస్తూ పాదయాత్ర చేస్తున్న హర్షవర్ధన్ రెడ్డికి కౌంటర్ వేశారు.

తెలంగాణకు నీళ్లు తీసుకురావడం హరీష్ రావు ఇష్టం లేదని. ప్రాజెక్టుల మీద కేసులు వేసిన బీరం హర్షవర్ధన్ రెడ్డి. పాదయాత్రలు చేయడం సిగ్గుచేటుగా ఉందన్నారు. తెలంగాణలో ప్రాజెక్టులే అవసరం లేదని చెప్పిన బీరం హర్షవర్ధన్ రెడ్డి. సుప్రీంకోర్టులో కేసులు వేశారని. అలాంటియిన పంటలు ఎండిపోతున్నాయి ఏడుస్తూ పెద్ద డ్రామా చేస్తున్నాడని వారు ఆరోపించారు.

కొల్లాపూర్ నియోజక వర్గంలో వివిధ మండలాలు తిరుగుతూ ముసలి కన్నీరు కారుస్తూ కొల్లాపూర్ కు గద్దె నాయకుడు నిరంజన్ రెడ్డిని తీసుకువచ్చి మాట్లాడిస్తున్నాడు. అయినా ప్రజలు నమ్మడం లేదు. ఏలి నివో ప్రకృతి పరిస్థితుల వల్ల కరువు ఏర్పడుతుంటే టిఆర్ఎస్ పార్టీ వాళ్లు కాంగ్రెస్ తెచ్చిన కరువు అని సిగ్గు లేకుండా చెబుతున్నారు.

హర్షవర్ధన్ రెడ్డి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిస్తే 98 జీవో నిర్వసితులకు గెలిచిన వెంటనే ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పావు కదా ఒకవేళ నేను చేయకపోతే చిన్నంబావి చెట్టుకు నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి చిన్నంబాయి చెట్టుకు కడతానని చెప్పావు కదా మరి కట్టావా అని విమర్శించారు. ఎన్ని నాటకాలు బూటకాలు వాడిన ప్రజలు నమ్మే పరిస్థితిలో మిమ్మల్ని లేరని వారు విరుచుకుపడ్డారు.

కార్యక్రమంలో కొల్లాపూర్ మున్సిపల్ కౌన్సిలర్ బోరెల్లి మహేష్. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వంగ రాజశేఖర్ గౌడ్. బింగి మహేష్. నాగరాజు. రమేష్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు