ఎస్పీని కలిసిన టీజేఏ నూతన కమిటీ
మలుగు,(విజయక్రాంతి): ములుగు జిల్లాలో ఇటీవల నూతనంగా ఏర్పడిన తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ (Telangana Journalist Association) కార్యవర్గం గురువారం ఎస్పీ కేకాన్ సుధీర్ రామ్ నాథ్(Mulugu SP K. Sudhir Ram Nath)కు పుష్పగుచ్చం అందించి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీ జర్నలిస్ట్ అసోసియేషన్ నూతన(టిజేఏ) కార్యవర్గాన్ని అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎస్పీ జిల్లా కేంద్రంలోని తన ఛాంబర్ లో టీజేఏ జిల్లా కమిటీతో మాట్లాడారు.
ఈ సందర్భంగా జిల్లాలోని వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలు(Working Journalists Issues), మీడియా భద్రత, సమాచార అందుబాటు వంటి అంశాలపై ఆయన సుదీర్ఘంగా చర్చించారు. తదనంతరం ఎస్పీ మాట్లాడుతూ సమాజంలో నిజాలను నిర్భయంగా ప్రజలకు చేరవేయడంలో జర్నలిస్టుల పాత్ర కీలకమని పేర్కొన్నారు. చట్ట పరిధిలో జర్నలిస్టులు తమ విధులు నిర్వర్తించేందుకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ సహకరిస్తుందని తెలిపారు. తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ ములుగు జిల్లా నూతన కమిటీకి ఆయన అభినందనలతో పాటు ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు ప్రకటించారు.
జర్నలిస్టులకు ఎలాంటి సమస్య ఉత్పన్నమైన తక్షణమే తన ద్రుష్టి కి తీసుకురావాలని, సమస్యల పరిష్కారం కోసం తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని ఆయన అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ జర్నలిస్టు అసోసియేషన్(టి జె ఏ) జిల్లా నూతన కమిటీ ఎస్పీకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఎస్పీ ని కలసిన వారిలో తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ ములుగు జిల్లా అధ్యక్షుడు బేతి సతీష్ యాదవ్, ప్రధాన కార్యదర్శి ఎనగందుల కొమురయ్య, ఉపాధ్యక్షుడు చల్లగురుగుల రాజు, కోశాధికారి సంఘ రంజిత్ కుమార్, సభ్యులు బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.