కమాన్‌పూర్ మాజీ ఎంపీపీ తోట చంద్రయ్యకు తీవ్ర అస్వస్థత

18-09-2026 | 06:48pm

బ్రెయిన్‌ స్ట్రోక్‌ వచ్చినట్లు సమాచారం.. అత్యవసరంగా కరీంనగర్‌ అపోలోకు తరలింపు

రామగిరి, సెప్టెంబర్‌ 18 (విజయ క్రాంతి) పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్‌ మాజీ ఎంపీపీ, కాంగ్రెస్‌ నాయకుడు తోట చంద్రయ్య (Congress leader Thota Chandrayya) శుక్రవారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అకస్మాత్తుగా అనారోగ్యానికి గురికావడంతో కుటుంబ సభ్యులు, అనుచరులు హుటాహుటిన కరీంనగర్‌లోని అపోలో ఆసుపత్రికి (Apollo Hospital) తరలించారు.

చంద్రయ్యకు బ్రెయిన్‌ స్ట్రోక్‌ వచ్చినట్లు ప్రాథమికంగా సమాచారం. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతున్నట్లు తెలిసింది. ఆయన ఆరోగ్య పరిస్థితిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

చంద్రయ్య అస్వస్థతకు గురైన విషయం తెలియడంతో కాంగ్రెస్‌ పార్టీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు చంద్రయ్య ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వైద్యులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం.

మరిన్ని వార్తలు