‘జీ2’ వచ్చేది ఫిబ్రవరిలోనే..

18-09-2026 | 06:32pm

బ్లాక్‌బస్టర్ స్పై థ్రిల్లర్ ‘గూఢచారి’(Goodachari)కి సీక్వెల్‌గా తెరకెక్కుతున్న చిత్రం ‘జీ2’. అడివి శేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాతో వినయ్ కుమార్ సిరిగినీడి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ మూవీ రిలీజ్ డేట్‌ను మేకర్స్ ప్రకటించారు. 2027 ఫిబ్రవరి 5న థియేటర్ల ద్వారా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియాగా ప్రేక్షకుల ముందుకు రానుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్(abhishek agarwal) ఈ సినిమాని భారీగా నిర్మిస్తున్నారు. యాక్షన్‌తోపాటు ఎమోషన్ వున్న క్యారెక్టర్ ఇది. ఈ రెండోభాగంలో ఈసారి ‘ఏజెంట్ 116’గా వామికా గబ్బి ఎంట్రీ ఇస్తోంది. ఇమ్రాన్ హష్మీ పవర్ ఫుల్ పాత్ర పోషిస్తుండగా.. మురళీశర్మ, సుప్రియా యార్లగడ్డ, మధుశాలిని కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 


మరిన్ని వార్తలు