జలసిరితో భూగర్భ జలాల పెంపునకు చర్యలు
వెంకటాపూర్, సెప్టెంబర్ 18 (విజయక్రాంతి): మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో శుక్రవారం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క(Minister Seethakka) దిశానిర్దేశం మేరకు జలసిరి ఫ్లెక్సీలను ఆవిష్కరించారు. 'ప్రతి ఇంటికి ఇంకుడు గుంత.. ప్రతి చేనుకు పంటకుంట.. ప్రతి ఊరికి ఊటకుంట’ అనే నినాదంతో కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని అధికారులు సూచించారు.
వీబీ జీ రామ్ జీ నిధులను వినియోగిస్తూ గ్రామాల్లో భూగర్భజలాలను పెంపొందించడంతో పాటు ఉపాధి హామీ కూలీలకు నిరంతరం పనులు కల్పించేలా చర్యలు చేపట్టాలని, గ్రామాల అవసరాలకు అనుగుణంగా 40 శాతం మెటీరియల్ కాంపోనెంట్ నిధులను వినియోగించి గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వాలని, నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపు, గ్రామాభివృద్ధి, ఉపాధి కల్పన లక్ష్యాలతో జలసిరి కార్యక్రమాన్ని సమన్వయంతో అమలు చేయాలని అధికారులు సూచించారు.