రెడ్ క్రాస్ జిల్లా కమిటీ సభ్యునిగా శ్రీనాథ్
05-10-2026 | 07:00pm
వెంకటాపురం,(విజయక్రాంతి): వెంకటాపురం గ్రామానికి చెందిన వద్ది శ్రీనాథ్ రెడ్ క్రాస్ ములుగు జిల్లా కమిటీ సభ్యునిగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఎన్నికల అధికారి ధర్మానాయక్(Election Officer Dharmanayak) నియామక ఉత్తర్వులు అందజేశారు. బాధ్యత పెంచిందని శ్రీనాథ్ తెలిపారు. రెడ్ క్రాస్ సేవలను పేదలకు అందేలా కృషి చేస్తానన్నారు. వరదలు, ప్రకృతి విపత్తుల సమయంలో బాధితులకు సంస్థ ద్వారా అండగా నిలుస్తామని పేర్కొన్నారు.