ఉపాధ్యాయుల సేవలు వెలకట్టలేనివి
లయన్స్ క్లబ్ నేరేడుచర్ల..
నేరేడుచర్ల, అక్టోబర్ 05 (విజయక్రాంతి): లయన్స్ క్లబ్ నేరేడుచర్ల(Nereducherla Lions Club) ఆధ్వర్యంలో అక్టోబర్ 05న అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా అంకితభావంతో విద్యార్థులకు ఉత్తమ విద్యను అందిస్తున్న ఉపాధ్యాయులను సన్మానించారు. మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల(ఎంపీపీస్) బేట్టగూడెం ఎస్జీటీ టి. ప్రమీల, జడ్పీహెచ్‌ఎస్ సోమవారం తెలుగు సహోపాధ్యాయులు ధనావత్ హరీష్ నాయక్ లను శాలువాలతో సన్మానించి, అభినందనలు తెలిపారు.
లయన్స్ క్లబ్ నేరేడుచర్ల అధ్యక్షులు షేక్ యూసుఫ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమ ముఖ్య అతిథి డిస్ట్రిక్ట్ చైర్పర్సన్ బట్టు మధు మాట్లాడుతూ, ఉపాధ్యాయుల సేవలు వెలకట్టలేనివని అన్నారు. భావితరాన్ని తీర్చిదిద్దడంలో, దేశ అభివృద్ధికి అవసరమైన ఉత్తమ విద్యార్థులను తయారు చేయడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో క్లబ్ ప్రధాన కార్యదర్శి సరికొప్పుల నాగేశ్వరరావు, ఉపాధ్యక్షులు,గుండా సత్యనారాయణ, బాల వెంకటేశ్వర్లు, జీఎంటీ కోఆర్డినేటర్ లాయర్ విశ్వనాథం, అడ్వైజరీ కమిటీ చైర్‌పర్సన్ రాచకొండ విజయలక్ష్మి, అరుణకుమారి, డీపీఓ ప్రణతి, అడ్వైజరీ కమిటీ సభ్యులు కొప్పు లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.