పురుగుల మందు త్రాగి యువకుడు మృతి

22-10-2026 | 08:21pm

కన్నాయిగూడెం, అక్టోబర్ 22(విజయక్రాంతి): ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం ఐలాపూర్ గ్రామంలో(Ailapur Village)  యువకుడి మృతితో విషాదఛాయలు అలుముకున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే గురువారం రోజున ఐలాపూర్ గ్రామానికి చెందిన యాళం సాగర్( 23)పురుగుల మందు త్రాగి మృతి చెందినట్టు సమాచారం.మృతిపై గల కారణాలు తెలియాల్సి ఉంది.

సాగర్ మృతికి వ్యక్తిగత కారణాల లేక ఆర్థిక ఇబ్బందులా అనేది తెలియాల్సిన  ఉంది.అందరితో కలిసి మెలిసి ఉండే సాగర్ మృతితో గ్రామస్తులు, కుటుంబ సభ్యులు, యువత దుఃఖ సాగరంలో మునిగిపోయారు.

దొడ్ల, మల్యాల మధ్యలో ఉన్న బ్రిడ్జి నిర్మాణం పూర్తి కాకపోవడంతో ఐలాపూర్ గ్రామానికి 108 వాహనాలు వెళ్లే పరిస్థితి లేదని, ఐలాపూర్ నుంచి కన్నాయిగూడెం మండల కేంద్రం రావడానికి 15కిలోమీటర్లు దూరంలో పూర్తి 10కిలోమీటర్లు అడవిలో ఉండటంతో ఆదివాసీ అడవి బిడ్డలకు వైద్యం అందక అనేక మంది మృతి చెందిన ఘటనలు ఉన్నాయి.

మరిన్ని వార్తలు