మీ చేతగానితనమే: మాజీ మంత్రి
కొల్లాపూర్: నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ లోని పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టు(Palamuru Rangareddy Project)ను సోమవారం మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి(Former Minister Niranjan Reddy), కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులతో సందర్శించారు. ఈ సందర్భంగా మీడియం సమావేశం వారు మాట్లాడుతూ... మూడేళ్ల కింద కేసీఆర్ ప్రారంభం చేసిన ప్రాజెక్టును, ఏఈలు స్విచ్ ఆన్ చేసి రైతులు కు నీళ్లు ఇచ్చేందుకు మంత్రితోనా ఏం అవసరం ఉందని మంత్రి ఫోటోలో వీడియోల కొరకు రైతులను ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు.
ఒకనాడు ఆలస్యమైన పంటలకు ఇబ్బంది అవుతది. ఒక్కనాడు నీళ్లు ముందొచ్చినా రైతులకు మేలు అవుతదని సోగి ఉండాల మంత్రి కని ఆరోపించారు. కేఎల్ఐ పంపులు నడిచే స్థితిలో ఉన్నాయని ఇంజనీర్లు చెబుతున్నారు. మూడిటిని ఆపకుండా 24 గంటలు నడపాలని రైతంగం పక్షాన మేము డిమాండ్ చేస్తున్నామన్నారు. నార్లపులు పంపు లోని ఐదు మోటర్లు రెడీగా ఉన్నాయి.
కానీ ఒక్క మోటార్ నడిపితే ఈ కరువులకు కెళ్ళి రైతులకు సాగునీరు అంది బయటపడతారన్నారు. పక్కన గుట్టల కిందనే శ్రీశైలం రిజర్వాయర్లోకి ఎగువ కురిసిన కర్ణాటక ఆ రెండు రాష్ట్రాల్లో ఉన్న రిజర్వాయర్ లన్ని నిండుకొని జూరాల మీదగా శ్రీశైలం చేరినటువంటి నీళ్లుమొత్తం ఈ సంవత్సరం 244 టీఎంసీల నీళ్లు వచ్చాయని అందులో 50 టీఎంసీలు ద్వారా కుడి ఎడమ విద్యుత్ ఉత్పత్తి కొరకు నాగార్జునసాగర్ కు వదిలిండ్రు.
ఉన్నటువంటి 185 టీఎంసీల శ్రీశైలం జలాశయం లోని నీళ్లను పాలమూరు రైతుల కోసం కృష్ణానది నీళ్లను ఏమైనా ఇచ్చిందా రేవంత్ సర్కార్ అని ఆరోపించారు. మనకి ఏం ఇయ్యలేదు నీళ్లన్నీ 100 పైచిలుకు టీఎంసీలు హక్కులైనటువంటి ఆంధ్ర ప్రాంతానికి తరలించిన అన్నారు. తక్షణమే మోటర్లు ఆన్ చేసి నీళ్లు ఇవ్వకపోతే రైతులతో కలిసి పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టును ముట్టడిస్తామని హెచ్చరించారు.