మరో రెండు గ్రామాలకు సోలార్ వెలుగులు

29-11-2026 | 12:56pm

అచ్చంపేట: రాష్ట్రంలో సంపూర్ణ సౌర విద్యుదీకరణ (Solar Electrification) కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వగ్రామమైన వంగూరు మండలం కొండారెడ్డిపల్లిలో అమలు చేస్తున్న సోలార్ విద్యుత్ నమూనాను మరో రెండు గ్రామాలకు విస్తరించాలని సూచించారు. నాగర్‌కర్నూల్ జిల్లా మన్ననూరులో టీజీఎస్‌పీడీసీఎల్ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. బల్మూరు మండలంలోని కొండారెడ్డిపల్లి, నాగర్‌కర్నూల్ మండలంలోని తుడుకుర్తి గ్రామాల్లో సంపూర్ణ సౌర విద్యుదీకరణ (Solar Power) చేపట్టి ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలని ఆదేశించారు.

సౌర విద్యుదీకరణను కేవలం గృహ అవసరాలకే పరిమితం చేయకుండా వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకూ విస్తరించాలని స్పష్టం చేశారు. సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుతో రైతులకు గరిష్ఠ ప్రయోజనం చేకూరేలా కార్యాచరణ రూపొందించాలని సూచించారు.జిల్లాలో నాణ్యమైన విద్యుత్ సరఫరా (Power Supply) విషయంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. విద్యుత్ సమస్యలపై ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు (Strict Action) తీసుకుంటామని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు