ఆటో జానీ గుర్తున్నాడా? ‘కాకా’ రిలీజ్ డేట్ ఫిక్స్!

29-11-2026 | 12:25pm

‘కాకా’తో సంక్రాంతికి మెగాస్టార్ మాస్ జాతర.. రిలీజ్ డేట్ ఖరారు!

మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు అదిరిపోయే Update వచ్చేసింది. దర్శకుడు బాబీ కొల్లి తెరకెక్కిస్తున్న ‘కాకా’ సినిమా విడుదల తేదీపై గత కొన్ని రోజులుగా Social Mediaలో సాగుతున్న ప్రచారానికి చిరంజీవి స్వయంగా Full Stop పెట్టారు. ఈ సినిమా 2027 సంక్రాంతికి విడుదల కావడం లేదని, ఆ స్థానంలో ‘విశ్వంభర’ ప్రేక్షకుల ముందుకు వస్తుందంటూ వచ్చిన వార్తలకు ఆయన క్లారిటీ ఇచ్చారు. జనవరి 13న ‘కాకా’ సినిమాను ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు Officially ప్రకటించారు. ఈ సందర్భంగా చిత్ర బృందం కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది.

ఆటో జానీ గుర్తున్నాడా?.. చిరు స్పెషల్ కామెంట్!

కొత్త పోస్టర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసిన చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "ఆటో జానీ గుర్తున్నాడా? ఈ సంక్రాంతికి సరికొత్తగా ‘కాకా’లో మీ ముందుకు వస్తున్నాడు. ఈసారి ఆటో జానీలో ఒక కొత్త కోణాన్ని చూపిస్తూ మిమ్మల్ని అలరించేందుకు ఎదురుచూస్తున్నాను" అంటూ అభిమానుల్లో ఆసక్తి పెంచారు. దర్శకుడు బాబీతో పాటు మొత్తం Movie Team అద్భుతమైన Theatrical Experience అందించేందుకు కష్టపడుతోందని తెలిపారు.

వింటేజ్ మాస్ లుక్‌లో మెగాస్టార్.. పోస్టర్ అదుర్స్!

తాజా పోస్టర్‌లో చిరంజీవి పూర్తిస్థాయి Vintage Mass Lookలో కనిపిస్తున్నారు. ఖాకీ షర్ట్, కార్గో ప్యాంట్, కళ్లద్దాలతో కాలర్ ఎగరేస్తూ నడుస్తున్న ఆయన స్టైల్ అభిమానులను ఆకట్టుకుంటోంది. నడుముకు తుపాకీ, వెనుక అనుచరులు.. ఇలా చిరు కనిపిస్తున్న తీరు సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది. ‘వాల్తేరు వీరయ్య’ తర్వాత చిరంజీవి, బాబీ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో ఇప్పటికే భారీ Hype నెలకొంది.

భారీ తారాగణంతో ‘కాకా’.. తమన్ మ్యూజిక్ స్పెషల్!

కెవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె. నారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనశ్వర రాజన్, నివేదా పేతురాజ్, సునీల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తుండగా, విజయ్ కార్తీక్ కణ్ణన్ Cinematography బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. జనవరి 13న వరల్డ్‌వైడ్‌గా విడుదల కానున్న ఈ సినిమా సంక్రాంతి బరిలో ఎలాంటి సందడి చేస్తుందో చూడాలి.


మరిన్ని వార్తలు