నారాయణపేట్ జిల్లా మద్దూర్ మున్సిపాలిటీ
18-09-2026 | 04:24pm
రెనివట్ల హజ్రత్ రాగ్ కట్టే సాబ్ దర్గాను సందర్శించిన మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి
మద్దూర్: కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి(Former Kodangal MLA Patnam Narender Reddy) శుక్రవారం రెనివట్ల దర్గాను సందర్శించారు. ఈ సందర్భంగా దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, స్వామివారిని దర్శించుకున్నారు. దర్గా నిర్వాహకులు, స్థానిక నాయకులు ఆయనకు స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఆయన స్థానికులతో మాట్లాడి పలు విషయాలను తెలుసుకున్నారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.