నిజామాబాద్‌లో పిస్తోల్ పేలి ఆర్ఎస్ఐ మృతి
18-09-2026 | 09:58am
నిజామాబాద్, సెప్టెంబర్ 18 (విజయక్రాంతి): నిజామాబాద్ పోలీస్ హెడ్ క్వార్టర్స్(Nizamabad Police Headquarters) లో పిస్తోల్ పేలి రిజర్వ్ ఎస్ ఐ సతీష్ మృతిచెందారు. శుక్రవారం ఉదయం పిస్తోల్ ను శుభ్రం చేస్తుండగా ప్రమాదవశాత్తు పేలినట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న సీపీ సాయి చైతన్య హుటా హుటిన ఘటన స్థలానికి చేరుకుని ప్రమాదానికి సంబంధించిన ఘటనపై వివరాలు తెలుసుకున్నారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.