22A భూసమస్యల పరిష్కారం.. హైలెవల్ కమిటీ ఏర్పాటు

18-09-2026 | 12:21pm

హైదరాబాద్: రాష్ట్రంలో సంచలనంగా మారిన 22A భూముల సమస్యలకు త్వరితగతిన పరిష్కారించేందుకు తెలంగాణ ప్రభుత్వం(Government of Telangana) కీలక నిర్ణయం తీసుకుంది. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti Srinivasa Reddy) ఆదేశాల మేరకు ఈ సమస్యలను తక్షణమే పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం హైలెవెల్ కమిటీ ఏర్పాటు చేసింది. ముగ్గురు అధికారులతో ప్రభుత్వం హైలెవెల్ కమిటీ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.

ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైలెవల్ కమిటీ చైర్మన్(High-Level Committee Chairman)గా సీసీఎల్ఏ కమిషనర్ లోకేశ్ కుమార్, హైలెవెల్ కమిటీ సభ్యులుగా లా సెక్రటరీ, స్టాంప్స్, రిజిస్ట్రేషన్ ఐజీ నియామకం అయ్యారు. అటు 118 జీవో బాధితులకు ఉపశమనం కల్పిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎల్బీనగర్ 9 వేల ప్లాట్లకు(LB Nagar plots) గ్రీన్ సిగ్నల్ ఇస్తూ రేవంత్ సర్కార్ ప్రభుత్వం జీవో విడుదల చేసింది.

మరిన్ని వార్తలు