దీపావళికి ముందే కొనుగోళ్ల పండగ!

25-10-2026 | 05:17pm

బెంగళూరు: భారతదేశం దీపావళి కోసం సిద్ధమవుతున్న కారణంగా కస్టమర్లు తమ ఇళ్లను కిచెన్ నుండి లివింగ్ రూమ్, బెడ్రూం మరియు అవుట్ డోర్స్ వరకు నవీకరణ చేస్తున్న కారణంగా కొనుగోలు పరిమాణం 3 రెట్లు కంటే ఎక్కువ వృద్ధితో ఈ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్(Amazon Great Indian Festival) 2026 శక్తివంతమైన ధోరణుల్లో ఒకటిగా హోమ్ అప్ గ్రేడ్స్ అభివృద్ధి చెందింది. ఈ ధోరణి కేవలం మెట్రోలకు మాత్రమే పరిమితం కాదు. లక్నో, జైపూర్, పాట్నా, గౌహతి, కోయంబత్తూరు, నాగపూర్, ఇండోర్ మరియు కొచ్చీ మొదలైన మెట్రోయేతర నగరాలు కూడా అమెజాన్.ఇన్ లో కొనుగోలు పరిమాణంలో 60% ఉన్నాయి. కస్టమర్లు ఇంతకు ముందు కొనుగోలు చేయని శ్రేణుల్లోకి ప్రవేశిస్తున్న కారణంగా  మెట్రోయేతర నగరాలు మెట్రోల కంటే రెండు రెట్లు వేగంగా వృద్ధి చెందుతున్నాయి.

"ఈ పండగ సీజన్ లో తమ ఇళ్లను నిజమైన ఆత్మవిశ్వాసంతో, ప్రజలు కొత్త టెక్నాలజీతో అప్ గ్రేడ్ చేయడం మేము చూస్తున్నాం మరియు ఈ వృద్ధిలో అత్యదిక భాగం మెట్రోయేతర పట్టణాల నుండి వస్తోంది. AI-ఆధారిత కుకింగ్ ఉపకరణాలు, రోబోటిక్ క్లీనర్లు, ఎయిర్ ప్యూరిఫైర్లు మరియు కనక్టెడ్ లైటింగ్ లు ఆ మార్పుకు ఆధిపత్యంవహిస్తున్నాయి. కస్టమర్లు ప్రీమియం ఉత్పత్తులను ఎంచుకుంటున్నారు మరియు భారీ కొనుగోళ్లతో మాపై విశ్వాసం చూపిస్తున్నారు స్మార్ట్ ఉపకరణాలపై ఫైనాన్సింగ్ కాటగిరీ సగటు కంటే ఎక్కువగా కొనసాగుతున్నాయి. కస్టమర్లు ఎక్కడ నివసిస్తున్నా వారి ఇంటి ముంగిటకు అత్యంత వేగంగా డెలివరీలను తేస్తుందని అమేజాన్ ఇండియా హోమ్ కిచెన్ డైరెక్టర్ అమన్ దీప్ లోహన్ అన్నారు.

కస్టమర్లు కిచెన్ ఉపకరణాల్లో ఎయిర్ ఫ్రైయర్లు మరియు ఓవెన్లు నుండి రిఫ్రిజిరేటర్లు మరియు డిష్ వాషర్ల వరకు కిచెన్ ఉపకరణాలు కొనుగోలు చేస్తున్నారు. కిచెన్ శ్రేణిలో, ఉపకరణాల కాటగిరి 3.4 రెట్లు సగటు-రోజు వేగంతో పెరుగుతోంది. సాధారణ రోజుతో పోల్చినప్పుడు స్మార్ట్ మరియు చిన్న ఉపకరణాలు 4.5 రెట్లు ఆధిపత్యంవహిస్తున్నాయి. ఈ శ్రేణులు కిచెన్ కాటగిరి కోసం మొత్తం షాపింగ్ పరిమాణంలో 70% కంటే ఎక్కువగా తోడ్పడతాయి. వినియోగదారులు వివరణల కుకింగ్ ఉపకరణాలకు అప్ గ్రేడ్ అవుతుండటంతో  ఎయిర్ ఫ్రైయర్స్ తమ  సగటు-రోజువారీ  వేగం కంటే  7.5 రెట్లు, ఓవెన్లు 5.2 రెట్లు వృద్ధిని సాధిస్తున్నాయి. అత్యంత వేగంగా అమ్ముడవుతున్న బ్రాండ్స్ లో ఫిలిప్స్ మరియు షార్క్ నింజా సాధారణ రోజులకంటే  7 రెట్లు కంటే ఎక్కువగా వృద్ధిని నమోదు చేసాయి. 

ఎస్ ప్రెస్సో మెషీన్లు తమ సగటు -రోజూవారీ వేగం కంటే చాలా రెట్లు అధిక వృద్ధిని సాధిస్తున్నాయి. వీటిలో డీలోంగీ 5 రెట్ల వృద్ధితో అగ్రస్థానంలో ఉంది. పెద్ద కిచెన్ ఉపకరణాల్లో, అధిక సామర్థ్యంగల రిఫ్రిజిరేటర్లు అనగా 300L కంటే ఎక్కువ సామర్థ్యం గల రిఫ్రిజిరేటర్లు తమ సగటు-రోజూవారీ వేగం కంటే 34 రెట్లు వృద్ధిని సాధిస్తున్నాయి, పెద్ద స్క్రీన్స్ నుండి కనక్టెడ్ లైటింగ్ మరియు క్లీనర్ ఎయిర్ వరకు లివింగ్ రూమ్ అప్ గ్రేడ్ కొనసాగుతోంది. కస్టమర్లు పెద్ద స్క్రీన్స్ నుండి ఎక్కువ కనక్ట్ చేయబడిన ప్రదేశాలకు తరలిన కారణంగా లివింగ్ రూమ్ లో అప్ గ్రేడ్ అత్యంత స్పష్టంగా కనిపిస్తోంది. స్మార్ట్ టివిలు, స్పీకర్లు మరియు యాక్ససరీస్ వంటి ఎంటర్టైన్మెంట్ డివైజ్ లు మార్గదర్శకంగా నిలిచాయి.

మరిన్ని వార్తలు