అక్రమార్కులకు కాసులు.. అధికారులకు మామూళ్లు!
- అక్రమ నీటి దందాకు అధికారుల అండదండ
- జిన్నారం, గుమ్మడిదలలో జోరుగా నీటి వ్యాపారం
- రాత్రింబవళ్లు పరిశ్రమలకు నీటి తరలింపు..
- కానరాని అధికారుల తనిఖీలు
పటాన్చెరు/జిన్నారం/గుమ్మడిదల, అ క్టోబర్ 25 : పారిశ్రామిక ప్రాంతాలుగా పేరుగాంచిన జిన్నారం, గుమ్మడిదల మండలా ల్లో అక్రమ నీటి తరలింపు(Illegal Water Transport) వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఆయా మండలా ల్లోని పలు గ్రామాల నుంచి నీటిని సేకరించి పరిశ్రమలకు తరలిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
రాత్రి, పగలు తేడా లేకుండా నీటిని ట్యాంకర్ల ద్వారా తరలిస్తూ కొందరు అక్రమార్కులు భారీగా సొమ్ము చేసుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అక్రమార్కులకు కాసులు కురిపిస్తు న్న నీటి దందాపై అధికారులు మాత్రం ని మ్మకుండిపోయి మామూళ్ళ మత్తులో తూ గుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
గ్రామాల నుంచి పరిశ్రమలకు....
జిన్నారం మండలంలోని నల్తూర్, కిష్టయ్యపల్లి, అల్లినగర్, గడ్డపోతారం, కాజిపల్లి, బొల్లారం గ్రామాలతో పాటు గుమ్మడిదల మండలంలోని బొంతపల్లి, వీరన్నగూడెం, గుమ్మడిదల, దోమడుగు, మంబాపూర్ గ్రామాల నుంచి నీటిని సేకరించి పరిశ్రమలకు తరలిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. రోజూ పెద్ద సంఖ్యలో నీటి ట్యాంకర్ల రాకపోకలు సాగుతున్నాయనే విమర్శలు స్థానికంగా వ్యక్తమ వుతున్నాయి.
నీటి తరలింపు వ్యవహారంపై సంబంధిత అధికారుల స్పందనపైనా స్థానికులు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. అక్రమ నీటి దందాను అరికట్టాల్సిన అధికారులే ఈ వ్యవహారంపై అంగీకరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో చర్యలు ఎందుకు కనిపించడం లేదన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
అడుగంటుతున్న భూగర్భ జలాలు...
ఇదే పరిస్థితి కొనసాగితే గ్రామాల్లో నీటి లభ్యతపై ప్రభావం పడే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నీటిని ఏ వనరుల నుంచి సేకరిస్తున్నారు? తరలింపునకు అనుమతులు ఉన్నాయా? నిబంధనలకు విరుద్ధంగా నీటిని తరలిస్తున్న వారిపై అధికారులు పర్యవేక్షణ చేస్తున్నారా? అన్న అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది.
మామూళ్ల మత్తులో అధికారులు..
జిన్నారంగుమ్మడిదల మండలాల్లో అక్రమంగా నీటి దండా కొనసాగుతున్నా సంబంధిత అధికారులు మాత్రం చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఈ వ్యవహారంపై అధికారుల అండదండలు మెండుగా ఉన్నాయని, ఇందుకు భారీ ఎత్తున ముడుపులు అందుతున్నట్లు ప్రచారం సాగుతోంది. ఇప్పటికైనా నీటి తరలింపుపై సమగ్ర విచారణ చేపట్టాలని,
అక్రమాలు నిర్ధారణ అయితే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. కాగా అక్రమ నీటి తరలింపుపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే.