యూనిఫాం కలర్‌ఫుల్‌గా!

20-09-2026 | 05:05am
  1. ఆకర్షణీయమైన రంగులు, డిజైన్లలో వైవిద్యం  
  2. వచ్చే ఏడాదికి ఇప్పటి నుంచే ప్రణాళిక
  3. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశం 

హైదరాబాద్, సెప్టెంబర్ 19 (విజయక్రాంతి): విద్యార్థుల యూనిఫాం(Students uniform)ను మరింత ఆకర్షణీయమైన రంగులు, కొత్త డిజైన్లతో వై విద్యంగా ఉం డాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(Chief Minister Revanth Reddy) అధికారులను ఆదేశించారు. విద్యార్థుల యూనిఫాం(Students' uniform), ఇతర సామగ్రి పంపిణీపై శనివారం సీఎం ఉన్నతస్థా యి సమీక్ష నిర్వహిం చారు. వచ్చే ఏడాది పాఠశాలలు తెరిచిన రో జే యూనిఫాం విద్యార్థులకు అందజేయాలని, ఇప్పటి నుంచే ప్రణాళిక రూ పొందిం చాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాల ల్లో10 శాతం మంది విద్యార్థులు అదనంగా చేరే అవకాశం ఉందని, అందుకు తగినట్టుగా కార్యాచరణ రూపొందించాలన్నారు. 

ఈ విద్యా సంవత్సరం పంపిణీ చేసిన యూని ఫాం నాణ్యతపై తల్లిదండ్రుల నుంచి సంతృ ప్తి వ్యక్తమైందని సీఎం తెలిపారు. కాగా ప్రభు త్వ పాఠశాలలు, ప్రభుత్వ వసతిగృహాలు(Government Hostels), రెసిడెన్షియల్స్ స్కూళ్ల విద్యార్థులకు ఒక జత యూనిఫాం పంపిణీ పూ ర్తయిందని, రెండో జత ఈ నెలాఖరులోగా అం దజేస్తామని ముఖ్యమంత్రికి అధికారులు తెలియజేశారు. కేజీబీవీ, మోడల్ స్కూల్ విద్యా ర్థులకు రెండు జతల యూనిఫాం ఇచ్చినట్లు తెలిపా రు.

నోటు పుస్తకాలు, ప్లేట్లు, గ్లాసులు, కటోరాలు, స్ఫూన్లు ఇతర సామగ్రి కూడా పూర్తి స్థాయిలో అందజేసినట్లు వివరించారు. స మీక్షలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి, ఎంపీ వేం నరేందర్‌రెడ్డి, సీఎం ప్రి న్సిపల్ సెక్రెటరీ శ్రీధర్, సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాసులు, వివిధ శాఖల అధికారులు సబ్యసాచి ఘోష్, బాల మాయాదేవి, అహ్మద్ నదీమ్, దివ్య దేవరాజన్, నవీన్ నికోలస్, శ్రుతి ఓజా, సైదులు, సంతోష్ ,సీతా లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు