హైదరాబాద్లోనే ఉంటే ఎలా?
హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల్లో నిధుల దుర్వినియోగంపై తెలంగాణ బీజేపీ కో-ఇన్చార్జ్ అభయ్ పాటిల్(Telangana BJP Co-Incharge Abhay Patil) సమీక్ష నిర్వహించారు. నిధుల అక్రమ వినియోగానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అవసరమైతే క్రిమినల్ కేసులు(Criminal cases) కూడా నమోదు చేస్తామని హెచ్చరించారు.
జిల్లా అధ్యక్షుల పనితీరుపైనా అభయ్ పాటిల్ ప్రశ్నలు సంధించారు. ముగ్గురు మినహా మిగతా జిల్లా అధ్యక్షులు హైదరాబాద్ హెడ్క్వార్టర్లోనే ఉంటే క్షేత్రస్థాయిలో పార్టీ కార్యక్రమాలు ఎలా కొనసాగుతాయని ప్రశ్నించారు. ఇకపై మేనేజ్ చేసుకుని పదవులు పొందే పరిస్థితి ఉండదని స్పష్టం చేశారు. పార్టీ నేతల పర్యటనలను ఇకపై తామే నేరుగా పర్యవేక్షిస్తామని అభయ్ పాటిల్ తెలిపారు.