చేయూత పెన్షన్లపై క్షేత్రస్థాయిలో పరిశీలన

05-10-2026 | 07:10pm

ప్రభుత్వ ఆదేశాల మేరకు  క్షేత్రస్థాయిలో పరిశీలించిన డీఆర్డీఓపీడీ రాథోడ్ రవీందర్

ఉట్నూర్,(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసే  చేయూత  పెన్షన్లకు డీఆర్డీఓపీడీ, జిల్లా మానిటరింగ్  అధికారి రాథోడ్ రవీందర్(Monitoring Officer Rathod Ravinder) సోమవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. చేయూత పింఛన్ల కొరకు దరఖాస్తు చేసుకున్న అర్హులైన లబ్ధిదారుల వివరాలను మండల స్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

మండల స్థాయి అధికారులు  పరిశీలించిన దరఖాస్తులను ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రభుత్వం నుండి జారీ అయిన లబ్ధిదారుల  జాబితాలో కొంతమంది లబ్ధిదారుల వద్దకు వెళ్లి క్షేత్రస్థాయి పరిశీలన నిర్వహించారు. ఆయనతోపాటు జిల్లా పింఛన్ల ఇన్చార్జి  డీపీఎం జాదవ్ శేషారావు, ఎంపీడీవో  మహేందర్, ఈజీఎస్ ఏపిఓ  జాదవ్ శ్రీనివాసుల(EGS APO Jadhav Srinivas)తోపాటు సిబ్బంది పాల్గొన్నారు.

నీటి సమస్యను  కలెక్టర్ దృష్టికి తీసుకు వెళ్తా

ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని గిరిజన బాలుర వసతి గృహం(Tribal Boys' Hostel)లో  నెలకొన్న నీటి సమస్య ను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తానని  డిఆర్డీఓ పీడీ రాథోడ్ రవీందర్(DRDO PD Rathod Ravinder) అన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మండల కేంద్రంలోని లింగుడాలో  ఇంటర్ చదువుకునే విద్యార్థుల కోసం ఏర్పాటుచేసిన గిరిజన బాలుర వసతి గృహాన్ని  తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా విద్యార్థులకు అందించే భోజనాలు, ఇతర సౌకర్యాల పైన ఆరా తీశారు. వసతి గృహంలో తాగునీటి సమస్య  తీవ్రంగా ఉందని, లింగుడా నుండి నీటి తెచ్చుకోవలసిన పరిస్థితి ఉందని విద్యార్థులు పీడీ దృష్టికి తీసుకువచ్చారు. తాగునీటి సమస్య పరిష్కరించుటకు  తన వంతు కృషి చేస్తానని  విద్యార్థులకు హామీ ఇచ్చారు.

మరిన్ని వార్తలు