బినామీ ఆస్తులపై ఏసీబీ దూకుడు
హైదరాబాద్: మాజీ డీఎస్పీ భీమ్‌రెడ్డి(Former DSP Bheem Reddy)కి సంబంధించిన ఆస్తుల వ్యవహారంలో అవినీతి నిరోధక శాఖ (ACB) దర్యాప్తును ముమ్మరం చేసింది. ఆయన బినామీలు వ్యక్తులకు సంబంధించిన ఇళ్లలో ఏసీబీ అధికారులు సోదాలు(Telangana ACB raids) నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌తో పాటు మొత్తం 8 ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు కొనసాగుతున్నట్లు సమాచారం. బినామీల పేర్లపై భారీగా ఆస్తులు ఉన్నట్లు దర్యాప్తులో గుర్తించిన నేపథ్యంలో ఈ సోదాలు చేపట్టినట్లు తెలుస్తోంది.
సోదాల్లో ఆస్తులకు సంబంధించిన పత్రాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ఆధారాలు, ఇతర కీలక డాక్యుమెంట్లను అధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం. బినామీ ఆస్తులకు సంబంధించిన వివరాలను సేకరించడంతో పాటు, ఆస్తుల కొనుగోలు వెనుక ఉన్న ఆర్థిక వనరులపై కూడా ఏసీబీ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ తనిఖీలు పూర్తయ్యే వరకు మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. సోదాల్లో లభించే పత్రాలు, ఆధారాల ఆధారంగా దర్యాప్తు తదుపరి దశకు వెళ్లే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.