రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకున్న అడ్లూరి లావణ్య
ఆసిఫాబాద్, సెప్టెంబర్ 5 (విజయక్రాంతి): కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన ఉపాధ్యాయురాలు అడ్లూరి లావణ్య(Adluri Lavanya) తెలంగాణ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాన్ని అందుకున్నారు. వికారాబాద్ జిల్లా కొడంగల్(Kodangal)లో నిర్వహించిన అవార్డుల ప్రదానోత్సవంలో ఆమెకు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి యోగితా రానా ప్రశంసాపత్రం, పతకం అందజేశారు. రెబ్బెన మండలం రెబ్బెన ఎస్సీ కాలనీ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో సెకండరీ గ్రేడ్ టీచర్‌గా 16 ఏళ్లుగా అందిస్తున్న విశిష్ట సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారం లభించింది.
కార్యక్రమంలో ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి, డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నవీన్ నికోలస్, ఎమ్మెల్సీ శ్రీపాల్‌రెడ్డి, ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి సచ్చిదానంద చారి లావణ్యను ప్రత్యేకంగా అభినందించారు.






