5 September, 2026 | 6:40 PM

కేంద్ర ఎన్నికల కమిషన్ కు సీఈవో లేఖ

05-09-2026 | 05:12pm

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ(Special Intensive Revision) ప్రక్రియకు గడువు పొడిగించాలని కేంద్ర ఎన్నికల కమిషన్ (Central Election Commission)కు సీఈవో సుదర్శన్ రెడ్డి శనివారం లేఖ రాశారు. ఎస్ఐఆర్ గడువును మూడు వారాలపాటు పొడిగించాలని రాజకీయ పార్టీలు, ఓటర్ల వినతి మేరకు సీఈసీకి లేఖ రాసినట్లు సీఈవో పేర్కొన్నారు.

ఇప్పటికే గడువు సవరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సీఈసీ జ్ఞానేష్ కుమార్(CEC Gyanesh Kumar)ను గతనెలలో కోరారు.  అయితే అభ్యంతరాలు, క్లెయిమ్ ల గడువు సెప్టెంబర్ 16తో ముగియనుంది. రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ్లి వరకు 47.79 లక్షల ఓటర్లకు(Voters) నోటీసులు జారీ చేయగా, 32.39 లక్షల మంది ఓటర్లు నోటీసులో ఇచ్చిన సమయానికి హజరుకాలేకపోయ్యారని, రాష్ట్రంవ్యాప్తంగా 5,74,504 మంది హియరింగ్ పూర్తైందని రాష్ట్ర ఎన్నికల అధికారులు వెల్లడించారు. 

మరిన్ని వార్తలు