వ్యవసాయ రంగానికి విద్యుత్ కోతలతో ఇక్కట్లు

17-09-2026 | 11:03pm

- అలూర్ విద్యుత్ సబ్ స్టేషన్ ను సందర్శించిన ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి 

ఆర్మూర్, సెప్టెంబర్ 17 (విజయక్రాంతి): వ్యవసాయ రంగానికి విద్యుత్ కోతల(Power Cuts)తో పంటలకు సాగు నీరందక రైతులు గోస పడుతున్నారని ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన నిర్వహిస్తున్న జనతా గ్యారేజ్ కార్యక్రమంలో భాగంగా రైతులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆలూర్ మండల కేంద్రంలోని విద్యుత్ సబ్‌స్టేషన్‌ను మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా విద్యుత్ సరఫరా పరిస్థితిపై విద్యుత్ శాఖ అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.

రైతులకు 12 గంటల విద్యుత్ కూడా సక్రమంగా సరఫరా చేయడం లేదని జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అందించాల్సిన యూరియా, రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత విద్యుత్ వంటి అంశాల్లో ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపించారు. వ్యవసాయ రంగానికి 24 గంటల విద్యుత్ సరఫరా చేయకపోతే, పెద్ద ఎత్తున రైతులను సమీకరించి సెక్రటేరియట్‌ను ముట్టడిస్తామని ఆశన్నగారి జీవన్ రెడ్డి హెచ్చరించారు. ఆయన వెంట బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు.

మరిన్ని వార్తలు