నిర్మల్‌లో సినీనటి ఐశ్వర్య రాజేష్ సందడి
చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ ప్రారంభం
భారీగా తరలివచ్చిన అభిమానులు
నిర్మల్, అక్టోబర్ 1 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలో చందన బ్రదర్స్ షాపింగ్ మాల్‌ను గురువారం ప్రముఖ సినీనటి ఐశ్వర్య రాజేష్(Actress Aishwarya Rajesh) ప్రారంభించారు. అందరికి అందుబాటు ధరలలో వన్ స్టాప్ మాల్ సిబియస్(Chandana Brothers Shopping Mall) నిర్మల్, బోయివాడ, నటరాజ్ నగర్, లో ప్రారంభించబడం ఎంతో సంతోషదాయక మని అన్నారు.
షోరూం మేనేజింగ్ డైరెక్టరు జానా సురేష్ మాట్లాడుతూ.. 40 సంవత్స రాల అనుబంద సంస్థ తెలుగు రాష్ట్రాలలో ప్రారంభించిన ప్రతి చోటా అతి తక్కువ కాలంలోనే అక్కడి ప్రజల మన్ననలతో నెం.1 షోరూంగా నిలుస్తుండటం తమకు ఎంతో ఉత్సాహాన్ని, మరిన్ని ప్రదేశాలలో ప్రారంభించాలనే ప్రోత్సాహాన్ని అందిస్తుందని, నిర్మల్ విషయంలోనైతే షోరూం తీర్చిదిద్దడంలో గాని, ఇక్కడి ప్రజల అభిరుచికి సరిపడే వస్త్రా లు ఎంపిక చేయడంలోగాని ప్రత్యేక శ్రద్ధ పెట్టడంవలన ఇక్కడి కస్టమర్ల అభిమానాన్ని మరింత వేగంగా పొందుతామనడంలో తమకు అపారమైన నమ్మకంమందని తెలియజేసారు.
సినీనటి ఐశ్వర్య రాజేష్ మాట్లాడుతూ.. తాము చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో భాగం కావడం ఎంతో సంతోషకరమని, ఎందుకంటే నిర్మల్ లో ప్రతి చిన్న అవసరానికి, అది ఇంట్లో ఏ ఫంక్షన్లకైనా, షూటింగ్ కాస్ట్యూంలకైనా తాము మొదటిగా వెళ్ళేది సిబియస్‌కేనని, ఇక్కడ లభించే డిజైన్లూ - వెరైటీలూ వేరెక్కడా లభించవని చెప్పారు. ఇక మొదటిగా తామే షాపింగ్ చేయాలని వచ్చిన కస్టమర్ల అన్ని రకాల దుస్తులు అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ సందర్భంగా జబర్దస్త్ కళాకారులు ప్రదర్శించిన ప్రదర్శనలు ఆకట్టుకున్నా యి. ఈ కార్యక్రమంలో నిర్మల్ మున్సిపల్ చైర్ పర్సన్ అప్పల కావ్య గణేష్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.