బతుకమ్మ వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి
మహిళల భద్రత, మంచినీరు, పారిశుధ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి : ఎమ్మెల్యే కృష్ణారావు
కూకట్ పల్లి,(విజయక్రాంతి): బతుకమ్మ వేడుకల(Batukamma Festival)కు పకడ్బందీ ఏర్పాటులు చేయాలని, పిల్లల భద్రత, మంచినీటి సౌకర్యం, పారిశుధ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలని కూకట్ పల్లి(Kukatpally ) ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. రాబోయే బతుకమ్మ వేడుకలను పురస్కరించుకొని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు(MLA Madhavaram Krishna Rao) గురువారం ఐడిఎల్ రంగదాముని చెరువుని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వేడుకలకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ముందస్తు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకలను కూకట్పల్లి నియోజకవర్గంలో ప్రతి ఏడు ఘనంగా నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈఏడాది కూడా మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనే అవకాశం ఉన్నందున పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. వేడుకలకు వచ్చే ప్రజలకు మంచినీరు, పారిశుద్ధ్యం, విద్యుత్ దీపాలంకరణ లాంటి సౌకర్యాలను పూర్తిస్థాయిలో కల్పించాలని మున్సిపల్, వాటర్ వర్క్ విభాగాల అధికారులను ఆదేశించారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేలా సాంస్కృతిక ఏర్పాట్లను చేయాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ బాబురావు తదితరులు పాల్గొన్నారు.