విదేశీ మహిళల వ్యభిచార దందా!
డ్రీమ్ ప్రైడ్ హోటల్‌పై ఏహెచ్‌టీయూ, పోలీసుల సంయుక్త దాడి
పోలీసుల అదుపులో ఆరుగురు మహిళలునగదు,సెల్‌ఫోన్లు స్వాధీనం
శేరిలింగంపల్లి, అక్టోబర్ 1(విజయక్రాంతి): గచ్చిబౌలిలోని డ్రీమ్ ప్రైడ్ హోటల్‌ను(Gachibowli Hotel) అడ్డాగా చేసుకుని విదేశీ మహిళలతో వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. విశ్వసనీయ సమాచారం అందడంతో గచ్చిబౌలి పోలీసులు, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ (AHTU) అధికారులు సంయుక్తంగా హోటల్‌పై దాడి చేపట్టారు. ఈ సందర్భంగా నిర్వాహకులు నిఖిల్, రామ్మోహన్‌రెడ్డితో పాటు విటుడు హర్షిత్ సింఘానియాను అదుపులోకి తీసుకున్నారు. వ్యభిచార కార్యకలాపాల్లో ఉన్న ముగ్గురు విదేశీ మహిళలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ప్రధాన నిర్వాహకుడిగా గుర్తించిన నిఖిల్ ఢిల్లీకి చెందినవాడిగా విచారణలో తేలినట్లు పోలీసులు తెలిపారు.హోటల్‌లోని వేర్వేరు గదులను వ్యభిచార(Prostitution) కార్యకలాపాలకు వినియోగిస్తున్నట్లు దర్యాప్తులో గుర్తించారు. పట్టుబడిన మహిళలు ఉజ్బెకిస్తాన్‌కు చెందినవారని, ఇటీవలే హైదరాబాద్‌కు వచ్చినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. దాడిలో 23 ఉపయోగించిన కండోమ్‌లు, రూ.13 వేల నగదు, రెండు మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మహిళల పాస్‌పోర్టులు, వీసాలు చెల్లుబాటులోనే ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో మరెవరైనా ప్రమేయం ఉందా? మహిళలను నగరానికి ఎలా తీసుకువచ్చారు? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.