వైష్ణవితో రిలేషన్.. ఆనంద్ దేవరకొండ క్లారిటీ

09-09-2026 | 02:19pm

హైదరాబాద్‌: నటి వైష్ణవి చైతన్య(Actress Vaishnavi Chaitanya)తో తనకు రిలేషన్ ఉందంటూ వస్తున్న వార్తలపై నటుడు ఆనంద్ దేవరకొండ స్పందించారు. వైష్ణవి చైతన్య, తాను కలిసి నటిస్తున్న రెండో సినిమా కావడంతోనే తమ మధ్య సాన్నిహిత్యంపై ఇలాంటి ప్రచారం జరిగి ఉండొచ్చని తెలిపారు. తామిద్దరం మంచి స్నేహితులమని, అంతకు మించి తమ మధ్య ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. సినిమా పరిశ్రమలో కలిసి పనిచేసే నటీనటులపై ఇలాంటి వార్తలు రావడం సహజమేనని పేర్కొన్నారు. తమ స్నేహాన్ని రిలేషన్‌గా చిత్రీకరించడం సరికాదని అన్నారు.

మరిన్ని వార్తలు