అంగన్వాడీ సేవలు సద్వినియోగం చేసుకోవాలి
18-09-2026 | 09:17pm
మెట్ పల్లి, సెప్టెంబర్ 18 (విజయక్రాంతి): ప్రతి కుటుంబం అంగన్వాడీ సేవలు సద్వినియోగం చేసుకోవాలని సూపర్ వైజర్శామీమ్ సుల్తానా (Supervisor Shamim Sultana)అన్నారు. శుక్రవారం పోషన్ మాహ్ కార్యక్రమంలో (Poshan Mah program) భాగంగా అర్బన్ సెక్టార్ లోని దుబ్బవాడలోని అంగన్వాడి కేంద్రాలలో పోషణ మాసం కార్యక్రమం ఘనంగా నిర్వహిచారు.
ఈ సందర్బంగా సమతుల ఆహారo పై మరియు అంగన్ సేవలు సద్వినియోగం చేసుకోవాలని వివరించారు. ఐదు సంవత్సరాలలోపు పిల్లలను అంగన్వాడి కేంద్రానికి పంపాలని తల్లులకు సూచించడం జరిగింది. అలాగే గర్భిణీ స్త్రీలకు సీమంతాలు చేశారు. పన్నెండవ వార్డు సభ్యురాలు సుమయతబస్సుం ముఖీం ఆరోగ్య సలహాలు సూచనలు ఇవ్వడo జరిగింది. ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్లు గంగ లక్ష్మి, సుమలత, ఇందిర,ఐకెపి సభ్యురాలు మాధవి లు పాల్గొన్నారు.