టీటీడీ కల్తీ నెయ్యి కేసులో మరో అరెస్ట్

20-09-2026 | 05:05am

సుకృతి ఫుడ్స్ ప్రమోటర్ కైలాష్ చంద్‌కు కస్టడీ విధించిన విశాఖ ప్రత్యేక కోర్టు

అమరావతి, సెప్టెంబర్ 19: దేశంలో అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం(Tirumala Tirupati Devasthanams)(టీటీడీ) లడ్డూ తయారీ కల్తీ(Adulteration in Laddu Preparation)పై సుకృతి ఫుడ్స్(Sukruti Foods) ప్రమోటర్ అయిన కైలాష్ చంద్‌(Kailash Chand)ను ఈడీ అరెస్టు(ED arrest) చేసినట్లు శుక్రవారం ప్రకటించింది. కైలాష్ చంద్‌ను అరెస్టు చేసి విశాఖలోని ప్రత్యేక కోర్టులో హాజరుపరచగా కస్టడీ విధించినట్లు ఈడీ తెలిపింది. టీటీడీకి కల్తీ నెయ్యి వాడకంలో ఆయన హస్తం ఉందని ఆరోపించింది. లడ్డూ తయారీలో పామాయిల్, పామ్ కెర్నల్ ఆయిల్, పామోలిన్, వివిధ రసాయనాలతో కూడిన నకిలీ నెయ్యిని ఉపయోగించారని ఈడీ తెలిపింది.

వీటితో తయారు చేసిన నెయ్యిని ఆవు నెయ్యిగా చూపుతూ, మభ్యపెడుతూ సరఫరా చేసినట్లుగా దర్యాప్తులో గుర్తించామని ఈడీ అధికారులు పేర్కొన్నారు. ఈ కల్తీ కేసుకు సంబంధించి మనీలాండరింగ్ కేసులో కైలాష్ చంద్‌ను అరెస్టు చేసినట్లు స్పష్టం చేసింది. 2019 నుంచి 2024 మధ్య రూ. 230 కోట్ల కల్తీ నెయ్యిని వివిధ సంస్థలు సరఫరా చేశారు. ఇందులో కైలాష్ చంద్ సంస్థ సుకృతి ఫుడ్స్ రూ.96 కోట్ల నెయ్యిని సరఫరా చేశారని ఈడీ పేర్కొంది.

‘శ్రీ వైష్ణవి డెయిరీ స్పెషాలిటీస్, మల్గంగా మిల్క్  అండ్ ఆగ్రో ప్రొడక్ట్స్, ఏఆర్ డెయిరీ ఫుడ్స్’ వంటి వివిధ బినామీ సంస్థల ద్వారా కూడా కల్తీ నెయ్యి సరఫరాను సమన్వయం చేశాడని ఈడీ ఆరోపిస్తున్నది. తమ దర్యాప్తులో ఆయా సంస్థల్లో రికార్డులన్నీ తప్పుల తడకగా ఉన్నాయని తెలిపింది. కల్తీ నెయ్యి కేసులో ఇప్పటికే ‘భోలే బాబా ఆర్గానిక్ డెయిరీ మిల్క్’ ప్రమోటర్, డైరెక్టర్ అయిన విపిన్ జైన్‌ను కూడా ఈడీ అరెస్టు చేసింది.

మరిన్ని వార్తలు