బీఆర్ఎస్ నాయకులపై మరో కేసు నమోదు

09-09-2026 | 10:17am

హైదరాబాద్: తెలంగాణ వర్షకాల అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ( BRS leaders) నేతలకు మరో షాక్ తగిలింది. సైఫాబాద్ పోలీస్ స్టేషన్ లో బీఆర్ఎస్ నాయకులపై మరో కేసు నమోదైంది. అసెంబ్లీ గేట్ నంబర్ 3 వద్ద జరిగిన ఘటనలో కేటీఆర్(Kalvakuntla Taraka Rama Rao), హరీశ్ రావు, నవీన్ రెడ్డి, సుధీర్ రెడ్డి సహా మరికొందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మహిళా పోలీసుల(Women police) విధులకు ఆటంకం కలిగించి దుర్భాషలాడి, బెదిరించారని మహిళా కానిస్టేబుల్ పద్మావతి ఫిర్యాదు చేశారు. మహిళా పోలీసులను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపణలున్నాయి. టీషర్టులు విప్పి మహిళా పోలీసుల ఎదుట అర్ధనగ్నంగా నిలబడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఘటన వీడియోలు, ఫొటోలు, వైద్య రికార్డులు పోలీసులు పరిశీలించనున్నారు. 


మరిన్ని వార్తలు