జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా గాంధీ జయంతి

02-10-2026 | 12:33pm

ఆసిఫాబాద్,(విజయక్రాంతి): జిల్లా పోలీస్ కార్యాలయంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకల(Mahatma Gandhi Jayanti Celebrations)ను ఘనంగా నిర్వహించారు. జిల్లా ఎస్పీ నితికా పంత్(SP Nitika Pant) గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. గాంధీజీ పాటించిన సత్యం, అహింస, శాంతి, నైతిక విలువలు నేటి తరానికి ఎంతో అవసరమన్నారు. గాంధీజీ జీవితం, ఆశయాలు, స్వాతంత్ర్య ఉద్యమంలో ఆయన పాత్రపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని సూచించారు.

ఆయన సిద్ధాంతాలను భావితరాలకు అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు.సమాజంలో శాంతి, సామరస్యాలను పెంపొందించేందుకు గాంధీజీ చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని, ప్రజలకు న్యాయం, భద్రత కల్పించడంలో పోలీస్ సిబ్బంది ప్రజాసేవకు అంకితమై పనిచేయాలని సూచించారు. జిల్లా ప్రజలందరికీ గాంధీ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఐ అడ్మిన్ వామనమూర్తి, ఆసిఫాబాద్ టౌన్ సీఐ నీలం రవి, జిల్లా పోలీస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు