పీఎఫ్, పెన్షన్ పై అవగాహన

18-09-2026 | 12:11am

నస్పూర్, (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా సింగరేణి శ్రీరాంపూర్ ఏరియా కార్యాలయంలో పర్సనల్ విభాగం అధికారులు, సంక్షేమ అధికారులు, వెల్ఫేర్ విభాగం ఉద్యోగులకు పెన్షన్, పీఎఫ్ క్లేయింలు, అడ్వాన్స్ లపై సీఎంపీఎఫ్ రీజినల్ కమీషనర్ భరత్ కుమార్(CMPF Regional Commissioner Bharat Kumar) అవగాహన కల్పించారు. విజిలెన్స్ అవేర్నెస్ క్యాంపేయిన్ లో భాగంగా గురు వారం శ్రీరాంపూర్ ఏరియా జీఎం మునిగంటి శ్రీనివాస్ సమక్షంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

షెడ్యుల్ సి (C) గురించి, ఉద్యోగి చనిపోతే నామినేషన్ లేకుంటే సెటిల్మెంట్ల విషయంలో ఏ విధంగా క్లేయిమ్స్ పొందుపరచాలన్నదానిపై అవగాహన కల్పించారు. సీఎంపీఎఫ్ ఏర్పాటు, సింగరేణిలో సీఎంపీఎఫ్ సేవలు ప్రారంభం, దాని వల్ల ఉద్యోగులకు కలిగే ప్రయోజనాలను వివరించారు. అనంతరం ఉద్యోగులందరితో ఇంటిగ్రిటీ ప్లెడ్జ్ ఫర్ సిటిజన్స్ ప్రతిజ్ఞ చేయించారు. 

మరిన్ని వార్తలు