పౌష్టికాహారంతో సంపూర్ణ ఆరోగ్యం
గర్భిణీ మహిళకు సీమంతం
కోహెడ, సెప్టెంబర్ 25,(విజయక్రాంతి): పౌష్టికాహారంతోనే(Nutritious food) గర్భిణీ, బాలింతలు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని, ఐసీడీఎస్ శనిగరం సెక్టార్ సూపర్‌వైజర్ సాయి భవాని(Sector Supervisor Sai Bhava) అన్నారు. శుక్రవారం మండలంలోని వింజపల్లి గ్రామ అంగన్వాడీ కేంద్రంలో పోషకాహార మాసోత్సవాల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆమె హాజరైయి మాట్లాడుతూ.. కిషోర బాలికలు ఎదిగే వయస్సులో శరీరంలో వచ్చే మార్పులకు అనుగుణంగా తృణధాన్యాలైన రాగి, సజ్జలు, జొన్నలు, గోధుమలు, సోయాబీన్, చిక్కుడుకాయలు, కాయగూరలు, ఆకుకూరలు, పాలు, గుడ్డు వంటి పోషకాలు కలిగిన ఆహారం తీసుకోవాలన్నారు.
గర్భిణీ మహిళలకు బిడ్డ ఎదుగుదల ఆరోగ్యవంతంగా ఉంటుందని, సాధారణ కాన్పు అవుతుందని సూచించారు. ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఒక పూట సంపూర్ణ పౌష్టికాహారం అందిస్తుందని చెప్పారు. ఈ సందర్బంగా గర్భిణీ మహిళకు సీమంతం పోషకాహార మాసోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమం లో సర్పంచ్ అన్నాడి శ్రీజ జీవన్ రెడ్డి, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.