సీఎం సభను విజయవంతం చేయాలి

25-09-2026 | 05:14pm

ముస్తాబాద్,సెప్టెంబర్ 25( విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రం లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో(Congress Party Office) మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గజ్జెల రాజు(Gajjela Raju) ఆధ్వర్యంలో ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు.ఈ నెల 30వ తేదీన సిరిసిల్లలో జరగనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Chief Minister Revanth Reddy)భారీ బహిరంగ సభను విజయవంతం చేయడానికి ప్రజలను తరలించి సభను విజయవంతం చేయడానికి మనమంతా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ మంజూరు చేసిన ముఖ్యమంత్రికి  కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఏళ్ళ బాల్ రెడ్డి కరీంనగర్ పార్లమెంట్ కో కన్వీనర్ చక్రధర్ రెడ్డి ఆత్మకమిటీ చైర్మన్ కొండం రాజురెడ్డి,జిల్లా కార్యవర్గ సభ్యులు,సర్పంచ్ లు,ఉప సర్పంచ్ లు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్లు,పట్టణ, గ్రామశాఖ అధ్యక్షులు యువజన నాయకులు విద్యార్థి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు