రేపు బారడి పోచమ్మ బోనాల పండుగ
ప్రతి ఇంటి నుంచి మహిళలు బోనాలతో తరలిరావాలి
బాన్సువాడ,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా(Kamareddy District) బాన్సువాడ పట్టణ శివారులోని బారడి పోచమ్మ అమ్మవారికి ఆదివారం బోనాల పండుగను అత్యంత భక్తిశ్రద్ధలతో, ఘనంగా నిర్వహించనున్నట్లు బారడి పోచమ్మ ఆలయ(Baradi Pochamma Temple) బోనాల కమిటీ అధ్యక్షులు దుద్దాల అంజిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటి నుంచి కనీసం ఒక మహిళ బోనం ఎత్తుకుని అమ్మవారి సన్నిధికి తరలిరావాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.
మన ఊరి ఆచారం, ఐక్యత, భక్తి విశ్వాసాలకు ప్రతీకగా నిలిచే బారడి పోచమ్మ బోనాల పండుగను అందరం కలిసి ఘనంగా జరుపుకుందామని కోరారు. మహిళలు సంప్రదాయ దుస్తుల్లో బోనాలతో పాల్గొని అమ్మవారికి మొక్కులు చెల్లించుకోవాలని, యువత, పెద్దలు కూడా కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.ప్రతి ఇంటి నుంచి బోనం రావాలి… ప్రతి కుటుంబం అమ్మవారి ఆశీస్సులు పొందాలన్నారు. మన బోనాలు మన ఐక్యతకు ప్రతీకగా నిలవాలి. భక్తిశ్రద్ధలతో పెద్ద సంఖ్యలో పాల్గొని బారడి పోచమ్మ బోనాల పండుగను విజయవంతం చేద్దాం అని అంజిరెడ్డి ప్రజలను కోరారు.






