మెరుగైన విద్యతో పాటు సౌకర్యాలు

17-09-2026 | 11:09pm

ఆర్మూర్ సెప్టెంబర్ 17 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యతో పాటు సౌకర్యాలను అందిస్తున్నందున విద్యార్థులు సద్వినియోగం చేసుకొని ఉన్నతంగా ఎదగాలని ఆలూర్ సర్పంచ్ ముక్కెర విజయ్(Sarpanch Mukkera Vijay) పేర్కొన్నారు. ఆలూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు యూనిఫాంలు, షూ పంపిణీ కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఆలూర్ మండల విద్యాధికారి నరేందర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. 

మరిన్ని వార్తలు