రాష్ట్రాన్ని విపక్ష నేతలు ఏం చేయాలనుకుంటున్నారు?

09-09-2026 | 10:43am

స్పీకర్‌ను అన్ని విధాలుగా అవమానించారు. 

దొరతనం పోకడలను భరించేందుకు రాష్ట్రం సిద్దంగా లేదు.

హైదరాబాద్: తెలంగాణ వర్షాకాల అసెంబ్లీ(Telangana Assembly)సమావేశాలు మూడో రోజు ప్రారంభమై కొనసాగుతున్నాయి. సభలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Deputy Chief Minister Bhatti Vikramarka) మాట్లాడుతూ.... సభాపతికి చేయాల్సిన అవమానాలన్నీ బీఆర్ఎస్(Bharat Rashtra Samithi) నేతలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అవమానాలను కొనసాగించే పరిస్థితి మానుకోవాలని భట్టి విక్రమార్క బీఆర్ఎస్ సభ్యులను కోరారు. సభాపతి సూచన చేస్తే వాదన పెట్టుకోకుండా సజావుగా నడిచేలా చూడాలని వెల్లడించారు. వెల్ లోకి వచ్చి చేయాల్సిన అవమానాలన్నీ చేసి స్పీకర్ పై సవాల్ విసురుతున్నారని మండిపడ్డారు. స్పీకర్ గడ్డం ప్రసాద్(Gaddam Prasad Kumar) సూచనలపై వాదనలు వినిపించే ప్రవర్తన బాగోలేదని భట్టి విక్రమార్క తేల్చిచెప్పారు.

ఆత్మగౌరవానికి భంగం కలిగించే ప్రయత్నం చేయవద్దని సూచించారు. విభజన తీసుకురావడానికి మరో ప్రయత్నం మంచిది కాదన్నారు. సభాపతితో పాటు వారి తల్లిని దూషిస్తే నిరసనలు తెలిపారని చెప్పారు. నిరసనలో భాగంగా దళితులు రోడ్డుపై నడిచారని పసుపు నీళ్లతో శుద్ధి చేశారని తెలిపారు. పసుపు నీటితో శుద్ధి చేసి అవమానించడమే కాకుండా న్యాయం కావాలంటున్నారని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. న్యాయం కావాల్సింది.. బలహీనవర్గాలు, దళిత, గిరిజనులకు అన్నారు. మీ చేతులలో అవమానానికి గురవుతున్న ప్రజలకు న్యాయం కావాలని విక్రమార్క సూచించారు. విపక్ష నేతల ఆగడాలు, అవమానాలను ప్రభుత్వం సంయమనంతో భరిస్తోందని హెచ్చరించారు. రాష్ట్రాన్ని విపక్ష నేతలు ఏం చేయాలనుకుంటున్నారు? అని భట్టి విక్రమార్క ప్రశ్నించారు. దొరతనం పోకడలను భరించడానికి రాష్ట్రం సిద్ధంగా లేదని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు