భూభారతి అవకతవకలపై మహాదీక్షకు తరలిన బీజేపీ నాయకులు
05-09-2026 | 12:24pm
భిక్కనూర్, సెప్టెంబర్ 4 (విజయ క్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన భూభారతి(BhuBharati) విధానంలోని అవకతవకలు, 22ఏ సమస్యలపై నిరసనగా నష్టపోయిన రైతులకు అండగా తెలంగాణ బీజేపీ(BJP) హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద చేపట్టిన మహాదీక్ష కార్యక్రమానికి భిక్కనూర్ మండల బీజేపీ నాయకులు, కార్యకర్తలు బయలుదేరారు. రైతుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, భూభారతి(BhuBharati) విధానంలోని లోపాలను సరిదిద్దాలని వారు డిమాండ్ చేశారు. భారీ సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు మహాదీక్షలో పాల్గొనేందుకు తరలివెళ్లారు.






