24 గంటలు గడిచిన కానరాని బాలుడి ..! ఆచూకీ
06-09-2026 | 03:35pm
బోధన్,సెప్టెంబర్ 06(విజయ క్రాంతి): నిజామాబాద్ మాత శిశు సంక్షేమ ఆసుపత్రి(Maternal and Child Health Hospital) నుంచి శనివారం కిడ్నాప్(Kidnap) గురైన మూడేళ్ల బాలుడు వేదాల్ష్ ఆచూకీ ఇంకా లభించలేదు. బాలుడి కోసం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపడుతున్నారు.
సీసీ కెమెరాలను సైతం క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ముసుగు ధరించిన మహిళ బాలుడికి చాక్లెట్ చూయించి, ఆటోలో తీసుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. బాలుడి రాక కోసం కుటుంబ సభ్యులు వేచి చూస్తున్నారు.






