కేటీఆర్, హరీష్ అరెస్ట్.. బీఆర్ఎస్ నాయకుల రాస్తారోకో

07-09-2026 | 07:48pm

దమ్మపేట,(విజయ క్రాంతి): అసెంబ్లీకి పోనీయకుండా ఎమ్మెల్యేను అడ్డుకున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ దమ్మపేట మండలం(Dammapeta Mandal)లోని మందలపల్లి నేషనల్ హైవేపై(Mandalapalli State Highway)  బిఆర్ఎస్ నాయకులు రాస్తారోకో చేశారు. నల్ల దుస్తులతో నిరసన తెలుపుతున్న సమయంలో పోలీసుల తోపులాటలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీష్ రావు, సబితా ఇంద్ర రెడ్డి, జగదీష్ రెడ్డి స్వల్పంగా గాయపడటంతో దమ్మపేట బీఆర్ఎస్(BRS) శ్రేణులు ఉద్వేగానికి గురైయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ తీరుకు, పోలీసుల వ్యవహారం పట్ల వ్యతిరేకంగా కార్యకర్తలు నినాదాలు చేస్తూ మండిపడ్డారు.

రాస్తారోకో చేస్తున్న నాయకులను, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి దమ్మపేట పోలీస్ స్టేషన్ కి తరిలించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు దొడ్డా రమేష్, మండల మాజీ ఉప అధ్యక్షులు గాజుబోయిన యేసు బాబు, సర్పంచ్ కొమరం సుశీల, రావుల శ్రీనివాసరావు, అబ్దుల్ జిన్న, వెలుగోటి మహేష్, రెడ్డిమళ్ళ నాగయ్య, యలమంచి చంద్రశేఖర్, కృష్ణ, శ్రీరాముల చక్రదరావు, నియోజకవర్గ మాజీ యూత్ కార్యదర్శి యార్లగడ్డ శ్రీనివాసరావు, మాజీ కో ఆప్షన్ ఎంపీటీసీ బుడే తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు