అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్

09-09-2026 | 10:59am

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు(Telangana Assembly) మూడో రోజు కొనసాగుతున్నాయి. శాసనసభలో బీఆర్ఎస్ సభ్యులు(BRS MLAs ) నిరసన తెలిపారు. We Want Justice అంటూ బీఆర్ఎస్ సభ్యుల నినాదాలు చేశారు. దీంతో అసెంబ్లీలో ఉద్రిక్తత వాతావరణ నెలకొంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను(BRS MLAs suspended) సస్పెండ్ చేయాలని  మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) తీర్మానం ప్రవేశపెట్టారు. దీంతో స్పీకర్ ఏకపక్షంగా తీర్మానాన్ని ఆమోదించారు. 


శాసనసభ నుంచి బీఆర్ఎస్ సభ్యులను సెషన్ మొత్తం స్పీకర్ సస్పెండ్ చేశారు.  శాసనసభ నుంచి హరీశ్ రావు, కేటీఆర్, జగదీశ్ రెడ్డి, గంగుల కమలాకర్, అనిల్ జాదవ్, కౌశిక్ రెడ్డి, మాధవరం కృష్ణారావు, సుధీర్ రెడ్డి, మాణిక్రావు, చింతా ప్రభాకర్, కొత్త ప్రభాకర్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి, రాజేశ్వర్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, కోవా లక్ష్మి, సునీతా లక్ష్మారెడ్డి, కాలేరు వెంకటేశ్, విజయుడు, వివేకానందతో పాటు పలువురిపై సస్పెన్షన్ వేటు పడింది.


మరిన్ని వార్తలు