బాలాపూర్, బడంగ్‌పేట్‌లో ప్రముఖుల సందడి
బడంగ్‌పేట్, సెప్టెంబర్ 19 (విజయక్రాంతి): బాలాపూర్(Balapur), బడంగ్పేట్ ప్రాంతాల్లో(Badangpet areas) కొలువుదీరిన గణనాథులను పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు(Political and film personalities) శనివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. బాలాపూర్ గణనాథుడిని(Balapur Ganesha) మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్(Etela Rajender), ఎల్బీనగర్ బీజేపీ ఇన్చార్జి సామ రంగారెడ్డి(Sama Ranga Reddy), మహేశ్వరం ఇన్చార్జి అందెల శ్రీరాములు యాదవ్(Andela Sriramulu Yadav) తదితరులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
అదేవిధంగా బడంగ్పేట్లోని శ్రీ వీరాంజనేయ భక్త సమాజం ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన భారీ గణపతిని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్(Talasani Srinivas Yadav), సినీ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్(Rahul Sipligunj) దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖులు మాట్లాడుతూ గణనాథుడి కృపతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం ఉత్సవ కమిటీ నిర్వాహకులు ప్రముఖులను ఘనంగా సన్మానించి, తీర్థప్రసాదాలు అందజేశారు.