చెత్తా కుప్పల కంటోన్మెంట్!

20-09-2026 | 05:30am
  1. రోడ్ల పక్కనే చెత్త చెదారం
  2. ఎక్కడ చూసినా నిర్మాణ వ్యర్థాలే
  3. బోర్డు అధికారుల పర్యవేక్షణ శూన్యం

సికింద్రాబాద్, సెప్టెంబర్19 (విజయక్రాంతి): ఓవైపు రాజకీయ నాయకులు(Politicians) నవ కంటోన్మెంట్ నిర్మాణం అంటూ మాట్లాడడం తప్ప.. కంటోన్మెంట్ స్థానిక ప్రజలకు ఒరిగిందేమీ లేదని వాపోతున్నారు.  కంటోన్మెంట్ బోర్డు(Cantonment Board) పరిధిలో పారిశుధ్య పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో రోడ్ల పక్కన, ఖాళీ స్థలాల్లో చెత్తాచెదారం(Garbage and debris) పెద్దఎత్తున పేరుకు పోయాయి.

ప్లాస్టిక్ వ్యర్థాల(Plastic waste)తో పాటు నిర్మాణ వ్యర్థాలు, చెక్క ముక్కలు, ఇతర చెత్త కుప్పలు, తెప్పలుగా దర్శనమిస్తున్నాయి. ప్రధాన రహదారి(Main road) పక్కనే భవన నిర్మాణ వ్యర్ధాలు, ప్లాస్టిక్ చెత్త పేరుకుపోవడంతో స్థానికులు, వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చెత్తను ఎప్పటికప్పుడు తొలగించాల్సిన కంటోన్మెంట్ బోర్డు అధికారులు తగిన చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.

బోర్డు అధికారుల నిర్లక్ష్యం?

ప్రజలు నిత్యం రాకపోకలు సాగించే ప్రాంతాల్లోనే ఈ స్థాయిలో చెత్త పేరుకుపోవడం అధికారుల పారిశుధ్య పర్యవేక్షణ(Sanitation Monitoring)పై ప్రశ్నలు తలెత్తేలా చేస్తోంది. స్వచ్ఛ కంటోన్మెంట్ పేరుతో హడావుడి చేయడమే అధికారులకే చెల్లింది. ఒకవైపు పారిశుధ్యంపై అవగాహన ప్పటికీ, మరోవైపు కార్యక్రమాలు నిర్వ పరిస్థితి బహిరంగ ప్రదేశాల్లో చెత్త కుప్పలు కనిపించడం విరుద్ధ పరిస్థితిని బోర్డు పరిధిలో చూపుతోంది.

చెత్త తొలగింపుతో పాటు నిరంతర పారిశుధ్య పర్యవేక్షణ, చెత్తను బహిరంగంగా వేయకుండా నియంత్రం చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. పలు ప్రాంతంలో చెత్త పేరుకుపోవడానికి కారణాలు ఏమిటి? ఇప్పటికే అధికారులు ఏమైనా చర్యలు చేపట్టారా? అనే అంశాలపై సంబంధిత కంటోన్మెంట్ అధికారులు స్పష్టత ఇవ్వాల్సి ఉంది.

మరిన్ని వార్తలు