21 August, 2026 | 2:40 AM

వృద్ధులకు అండగా కేర్ ప్రణామ్

21-08-2026 12:00 AM

విశాఖపట్నంలో ప్రత్యేక కార్యక్రమం

హైదరాబాద్, ఆగస్టు 20 (విజయక్రాంతి): కేర్ హాస్పిటల్స్ విశాఖపట్నంలో వృద్ధుల కోసం ‘ప్రణామ్’ ప్రత్యేక సంరక్షణ కార్యక్రమాన్ని విశాఖపట్నం పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి ప్రారంభించారు.

ఆస్టర్ డీఎం క్వాలిటీ కేర్ లిమిటెడ్ ప్రెసిడెంట్‌సేల్స్ అండ్ మార్కెటింగ్ శలభ్ డాంగ్, కేర్ హాస్పిటల్స్ విశాఖపట్నం హాస్పిటల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ జి. సుకేష్ రెడ్డి, సీనియర్ వైద్యులు పాల్గొన్నారు. వృద్ధులకు ఆసుపత్రి సేవలను మరింత సులభంగా, సౌకర్యవంతంగా అందించడమే ‘ప్రణామ్’ లక్ష్యమని కేర్ హాస్పిటల్స్ తెలిపింది. చైర్ యోగా, వాకింగ్ గ్రూపులు, హాబీ క్లబ్లు, రీడింగ్ సర్కిల్స్, ఆరోగ్య అవగాహన కార్యక్రమాలతో పాటు ప్రివెంటివ్ హెల్త్ చెకప్లు, ఓపీ, ఇన్పేషెంట్, ఫార్మసీ సేవల్లో ప్రత్యేక ప్రయోజనాలు కల్పించనున్నారు.