నాణ్యమైన విద్యుత్ అందించేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం
ప్రతి సబ్ స్టేషన్ కు రెండు ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు
విద్యుత్ శాఖ ఎస్ఈ బిక్షపతి
ములుగు, అక్టోబర్ 24 (విజయక్రాంతి) : వినియోగదారులకు మరింత మెరుగైన, నాణ్యమైన విద్యు త్ సరఫరా(Electricity supply) అందించేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని(Modern technology) అందిపుచ్చు కుంటూ పలు కీలక చర్యలు చేపడుతున్నట్లు ములుగు సర్కి ల్ సూపెరింటెండింగ్ ఇంజనీర్, బి.బిక్షపతి తెలిపారు. ఇందులో భాగంగా 33 కేవీ ఇంటర్లింక్ లైన్ల ఏర్పాటు, 33 కేవీ, 11 కేవీ విద్యుత్ లైన్లలో(KV power lines) ఫాల్ట్ ప్యాసేజ్ ఇండికేటర్ల వినియోగం, ప్రతి సబ్స్టేషన్లో రెండు పవర్ ట్రాన్స్ ఫార్మర్లు ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.
ఇంటర్లింక్ లైన్లతో ప్రత్యామ్నాయ విద్యుత్ సరఫరా ప్రకృతి వైపరీత్యా లు, నిర్వహణ పనులు, సాంకేతిక సమస్యలు(Technical issues), ఇతర కారణాల వల్ల ఒక విద్యుత్ లైన్లో సరఫరా నిలిచిపోయినప్పుడు వినియోగదారులకు(Consumers) వీలైనంత త్వరగా ప్రత్యామ్నాయ మార్గంలో విద్యుత్ అందించేందుకు 33 కేవీ ఇంటర్లింక్ లైన్లు ఎంతగానో దోహదపడతాయని వివరించారు. రోజురోజు పెరుగుతన్న లోడ్ కు అనుగుణంగా ప్రతి సబ్ స్టేషన్లో రెండు పవర్ ట్రాన్స్ఫా ర్మర్లు పెట్టడం జరుగుతుందని చెప్పారు.
వీటి వలన లోడ్ భారం తగ్గి మెరుగైన విద్యుత్ సరఫరా అందించబడుతుందని తెలిపారు. విద్యుత్ పంపిణీ వ్యవస్థను మరింత పటిష్ఠం చేయడంతో పాటు, విద్యుత్ అంతరాయాల సమయాన్ని తగ్గించి వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించేందుకు సంస్థ కృషి చేస్తోందని ఎస్ఈ పేర్కొన్నారు.