పట్టభద్రుల ఓటరు నమోదుపై బీఆర్ఎస్‌ స్పీడ్‌

24-10-2026 | 06:15pm

బూర్గంపాడు,(విజయక్రాంతి): ఉమ్మడి వరంగల్‌–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల(MLC elections) నేపథ్యంలో  బూర్గంపాడు మండలంలో బీఆర్ఎస్‌ నాయకులు ఓటరు నమోదు కార్యక్రమాన్ని ముమ్మరం చేశారు. మోరంపల్లిబంజర్‌ గ్రామంలో మాజీ జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత ఆధ్వర్యంలో జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని ఉపాధ్యాయులు, వైద్య సిబ్బందిని కలిసి అర్హులైన పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకోవాలని కోరారు.

సహ ఉద్యోగులు, పూర్వ విద్యార్థులకు కూడా అవగాహన కల్పించాలని సూచించారు.సారపాక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో బీఆర్ఎస్‌ మండల వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జలగం జగదీష్‌, పట్టణ అధ్యక్షుడు కొనకంచి శ్రీను ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు ఓటరు నమోదుపై అవగాహన కల్పించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతి ఓటు కీలకమని, అర్హులందరూ ఆన్‌లైన్‌లో నమోదు చేసుకుని ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వాములు కావాలని కోరారు.

కార్యక్రమాల్లో మోరంపల్లిబంజర్‌ ఉపసర్పంచి పొక్కుల రవి, మాజీ వార్డు సభ్యురాలు పద్మ, బీసీ సెల్‌ అధ్యక్షుడు చేతుల పెద్దవీర్రాజు, మూల బాలిరెడ్డి, కురుకుంట్ల చిన్నప్పరెడ్డి, గంగుల చంద్రశేఖర్‌రెడ్డి, సారపాక యువ నాయకులు సోము లక్ష్మిచైతన్యరెడ్డి, చల్లకోటి పూర్ణ, చట్టు ఆంజనేయులు, దాసరి మోహన్‌, పంగి సురేష్‌, ఈశ్వర్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు