ప్రజల అవసరాలే ప్రథమ ప్రాధాన్యం

02-10-2026 | 12:58pm

వీబీ-జీ రామ్ జీపై గ్రామసభ.. పనుల గుర్తింపుపై కీలక చర్చ

చేగుంట: గ్రామాభివృద్ధి పనుల ఎంపికలో ప్రజల భాగస్వామ్యానికి పెద్దపీట వేస్తూ చేగుంట మండలం(Chegunta Mandal) చందాయిపేట్ లో విబి -జి రామ్ జి పథకం( VB-G Ram Ji Scheme)పై  గ్రామ సర్పంచ్ తాలూకా మహేశ్వరీ సాయిబాబా అధ్యక్షతన, పంచాయతీ సెక్రటరీ కృష్ణ ఆధ్వర్యంలో గ్రామసభ హోరాహోరీగా సాగింది. గ్రామపంచాయతీ కావరణలో  సర్పంచ్ తాలూకా మహేశ్వరీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశానికి మండల ఇరిగేషన్ ఏ ఈ దివ్య శ్రీ హాజరై పథకం ద్వారా గ్రామానికి కలిగే ప్రయోజనాలు, ఉపాధి అవకాశాలు, చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై ప్రజలకు స్పష్టమైన అవగాహన కల్పించారు.

గ్రామంలోని అవసరాలను, ప్రతిపాదిత అభివృద్ధి పనులను వివరించిన ఏ ఈ .. ప్రజల అవసరాలే ప్రాతిపదికగా పనులను గుర్తించి, ప్రాధాన్యత క్రమంలో ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. అత్యవసర పనులను గుర్తించి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, నిబంధనల ప్రకారం పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ పబ్బ నాగేష్ గుప్తా, వ్యవసాయ అధికారి దివ్య,మార్కెట్ కమిటీ డైరెక్టర్ ముజామిల్,వార్డు సభ్యులు యాదగిరి,మారబోయిన మంగ,బండ ముత్యాలు, మధు, ఉమారాణి,పంచాయతీ కార్యదర్శి కృష్ణ ,ఏ ఎన్ ఎం, ఆశ వర్కర్లు, సిఫీల్డ్ అసిస్టెంట్, బుడ్డ ప్రదీప్,ఏ ఈ వో లు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు