నంబర్ ప్లేట్ మార్చి బురిడీ..
ట్రాఫిక్ పోలీసులకు చిక్కిన ఇన్నోవా
శంషాబాద్, ఆగస్టు 30 (విజయక్రాంతి):నంబర్ ప్లేట్లను మార్చి చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని శంషాబాద్ ట్రాఫిక్ సీఐ ప్రమోద్ కుమార్ హెచ్చరించా రు. ఆదివారం శంషాబాద్లోని ఇండియానా బేకరీ వద్ద నిర్వహించిన ఎన్ఫోర్స్మెంట్ తనిఖీల్లో నంబర్ ప్లేట్ మార్చి తిరుగుతున్న ఇన్నోవా కారును పోలీసులు పట్టుకున్నారు.
మధ్యాహ్నం 3.10 గంటల సమయంలో వెళ్తున్న కారును ఆపి తనిఖీ చేయగా, అసలు నంబర్ మరోటని తేలింది. పెండింగ్ చలా న్లు, వాహన వాయిదాల నుంచి తప్పించుకునేందుకే యజమాని ఆమనగల్లు మండ లంలో మూర్తుజపల్లి వోర్సు రమేష్ ప్రైవేట్ నంబర్ ప్లేట్ అమర్చినట్లు నిర్ధారించారు. నిందితుడితో పాటు వాహనాన్ని ఆర్జీఐఏ పోలీస్ స్టేషన్కు అప్పగించారు. వాహనాల గుర్తింపు మార్చే ప్రయత్నాలు చేస్తే ఉపేక్షించబోమని సీఐ స్పష్టం చేశారు.






