పాలిటెక్నిక్ విద్యావిధానంపై సీఎం రేవంత్ వ్యాఖ్యలు
కొడంగల్: వికారాబాద్ జిల్లా కొడంగల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో(Kodangal Government Junior College) జరిగిన 2026 ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్ చెప్పారు. పాలిటెక్నిక్ విద్యావిధానంలో(Polytechnic Education System) ఎలాంటి మార్పులు చేయట్లేదని స్పష్టం చేశారు. ఉపాధ్యాయుల బాధ్యత తాను చూసుకుంటానన్న సీఎం విద్యార్థుల బాధ్యత టీచర్లు చూసుకోవాలని ఆదేశించారు.
తాను పరీక్ష రాసేందుకు ఉపాధ్యాయుల వద్దకే వస్తానని సీఎం రేవంత్(CM Revanth) తెలిపారు. పరీక్ష రాయడానికి ఉపాధ్యాయుల వద్దకు వస్తే వారి చేతిలోనే బలం ఉంటుందన్నారు. 2028 డిసెంబర్ లో లేదా 2029 మార్చిలో ఎన్నికల(Telangana Elections) వస్తాయని సీఎం వెల్లడించారు. ఆర్థిక వెసులుబాటును బట్టి మీ సమస్యలను పరిష్కారిస్తామని తెలిపారు. ఉపాధ్యాయులు రెండేళ్ల నాకు సమయం ఇస్తే మీ సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. విధ్వంసం నుంచి వికాసం వైపు నడిపించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.






